రాజేశ్వరీ శతకం
1. తఱుగంజాలవు కోర్కె లీ ధరణిలో తన్వీమణిన్ గూడగన్, కుఱుచై బోవదు కోప మింక బహు సంకోచమ్ము లేదేలనో, నెఱియాసల్ మదివీడిపోవును గదా నిన్గాంచుచున్నంతలో మఱి నీ దాసుఁడఁ,జక్కఁ జేయుమిఁక శ్రీమద్రాజరాజేశ్వరీ! 2. పరమోత్కృష్ట వికాసమానవిలసత్పద్మాటవీ సంస్థితా సురగంధర్వులకైన బోధపడునే శోధింప తద్రూపమే, నరసింహాధ్వరి, వారి సోదరులు నానారీతి నర్చింపగన్, చిరకాలంబుగ నిన్ను నమ్మితిమికన్ శ్రీ రాజరాజేశ్వరీ! తా: దేవతలకు కూడా బోధపడని సహస్రదళ పద్మమధ్యమున విరాజిల్లు నీరూపమును నృసింహ దీక్షితులు వారి సోదరులు (నృహరి దీక్షితులు) అర్చించారు. వారి బిడ్డలమైన మేమూ నిన్నర్చిస్తున్నాము. 🙏🙇🏼♂️🙏 3 నీలా భ్రాకృతి రామచంద్రుడనగా నీవే కదా ఈశ్వరీ!లీలామానుషరూప మాధవుడవే లేదందువా భార్గవీ!ప్రాలేయాచలమందు వేల్పువని సంభావింప తప్పౌనటే!మాలో త్వచ్ఛుభరూపమున్ నిలుపు శ్రీమద్రాజరాజేశ్వరీ! 4. జలముల్ మారిన మారవచ్చు నదిలో సంవత్సరాల్ దాటినన్ కలకాలంబుగ పేరు మారదు కదా గంగాప్రవాహంబుకున్ కలుషంబుల్ తొలగించు దైవమ!మహాకారుణ్యమూర్తీ! సదా మలిజన్మంబుల రూపుమాపు మిఁక శ్రీమద్రాజరాజేశ్వరీ! 5. సదసద్రూప విరాజభూష విలసత్ సంతోషమున్ గూర్చు త్వ త్పదప...