2.7.2022 సమస్య:
భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్.
శ్రీ లక్ష్మీ దేవి మానసము నందలి భావనతో నా ప్రయత్నం:
మూర్తులు ముగ్గురుండఁ దుది మోహన రూపుని మాయఁ మున్గితిన్,
పూర్తిగ నమ్మి వేడినను బొత్తిగ నుండడు చెంతనెప్డు, దా
నార్తులు కుయ్యిడన్ బఱగు నాలిని వీడుచు దన్ను మర్చి, నా
భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్.
Comments
Post a Comment