ఉత్సాహ
ప్రథమ ప్రయత్నం.
ఉత్సాహము.
శ్రీనృసింహ! శ్రీనృసింహ! శ్రీనృసింహ! పాహిమామ్
శ్రీనృసింహ! శ్రీనృసింహ! శ్రీనృసింహ! రక్షమామ్
మేను పులకరింప నిన్ను మేడిపూరి భక్తులే
వేనవేల పూల నిన్ను వేడుకొనగ గావుమా!
కుంభినిన్ వరించి కాచి క్రోధరూపమెత్తుచున్
స్తంభమందు వెలసి దుష్ట సంఘములను దృంచితే!
దంభ మెంచబోకుమయ్య! దారిజూపు శ్రీహరీ!
శంభు తోడ వెలసి తీవు సర్వ భక్త పాలకా!
Comments
Post a Comment