Get link Facebook X Pinterest Email Other Apps December 26, 2022 *సిలువ -చర్చి-యేసు-క్రీస్తు*పదాలనుయోగించి విష్ణు స్తుతి:చందన చర్చిత దేహమునందమునన్ భాసిలు వరహారము, సిరియేసుందర మూర్తిగ నెలవగు,చందంబును గొల్తు నిన్ను చక్రీ! స్తుతులన్.యజ్ఞభగవాన్ గంగాపురం Get link Facebook X Pinterest Email Other Apps Comments
December 26, 2022 " రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్." ప్రయత్నం: భీముబలంబునన్ గెలిచె భీకర పోరుల లోకపాలురన్ గోమలి దేవవేశ్యనతి క్రూరముగా సెడగొట్టె దుష్టుడై, ధీమతి యౌనె రావణుడు దేవగణంబులఁ గెల్చి? యింద్రియా రాముని కోర్కె లన్నియును రావణుఁ డొప్పుగఁ దీర్చెఁ బ్రీతితోన్. ఇంద్రియారాముఁడు : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్య) విషయలోలుఁడు. Read more
July 02, 2022 2.7.2022 సమస్య: భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్. శ్రీ లక్ష్మీ దేవి మానసము నందలి భావనతో నా ప్రయత్నం: మూర్తులు ముగ్గురుండఁ దుది మోహన రూపుని మాయఁ మున్గితిన్, పూర్తిగ నమ్మి వేడినను బొత్తిగ నుండడు చెంతనెప్డు, దా నార్తులు కుయ్యిడన్ బఱగు నాలిని వీడుచు దన్ను మర్చి, నా భర్తయె భారమై సతిని బాధలకున్ గురిసేయు నెప్పుడున్. Read more
సమస్యా పూరణం December 26, 2022 సమస్య: దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. శోషితదానవుండు మధుసూదను డండగ కౌరవేంద్రతా శేషవిభూతిఁ బాండవుల చేతి కొసంగెను జేరదీసి సం తోషము నింపె, యుద్ధమున దోషుల నంపెను దేవభూమి, ని ర్దోషము లేకయుండుటయె దోషమటంచు వచింత్రు పండితుల్. దేవభూమి -స్వర్గము Read more
Comments
Post a Comment