పరమోత్కృష్ట వికాసమానవిలసత్పద్మాటవీ సంస్థితా
సురగంధర్వులకైన బోధపడునే శోధింప తద్రూపమే,
నరసింహాధ్వరి, వారి సోదరులు నానారీతి నర్చింపగన్,
చిరకాలంబుగ నిన్ను నమ్మితిమికన్ శ్రీ రాజరాజేశ్వరీ!
తా: దేవతలకు కూడా బోధపడని సహస్రదళ పద్మమధ్యమున విరాజిల్లు నీరూపమును నృసింహ దీక్షితులు వారి సోదరులు (నృహరి దీక్షితులు) అర్చించారు. వారి బిడ్డలమైన మేమూ నిన్నర్చిస్తున్నాము.
🙏🙇🏼♂️🙏
Comments
Post a Comment