సమస్యా:
చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే
నా ప్రయత్నం:
వరగుణ పల్లవాధరను, బావకొసంగుచు బెండ్లి సేయగన్
మురిపము తోడుతన్ జన నపూర్వహిమాలయ పర్వతమ్ములన్,
గిరణము లేమి చేయు మరు కేళిని మున్గ వినూత్న రీతిగన్,
చురచుర చూపులం గనలి చూడ్కులలో సుధఁ జిల్కె భానుఁడే.
Comments
Post a Comment