రాజేశ్వరీ శతకం
1.
తఱుగంజాలవు కోర్కె లీ ధరణిలో తన్వీమణిన్ గూడగన్,
కుఱుచై బోవదు కోప మింక బహు సంకోచమ్ము లేదేలనో,
నెఱియాసల్ మదివీడిపోవును గదా నిన్గాంచుచున్నంతలో
మఱి నీ దాసుఁడఁ,జక్కఁ జేయుమిఁక శ్రీమద్రాజరాజేశ్వరీ!
2.
పరమోత్కృష్ట వికాసమానవిలసత్పద్మాటవీ సంస్థితా
సురగంధర్వులకైన బోధపడునే శోధింప తద్రూపమే,
నరసింహాధ్వరి, వారి సోదరులు నానారీతి నర్చింపగన్,
చిరకాలంబుగ నిన్ను నమ్మితిమికన్ శ్రీ రాజరాజేశ్వరీ!
తా: దేవతలకు కూడా బోధపడని సహస్రదళ పద్మమధ్యమున విరాజిల్లు నీరూపమును నృసింహ దీక్షితులు వారి సోదరులు (నృహరి దీక్షితులు) అర్చించారు. వారి బిడ్డలమైన మేమూ నిన్నర్చిస్తున్నాము.
🙏🙇🏼♂️🙏
3
నీలా భ్రాకృతి రామచంద్రుడనగా నీవే కదా ఈశ్వరీ!లీలామానుషరూప మాధవుడవే లేదందువా భార్గవీ!ప్రాలేయాచలమందు వేల్పువని సంభావింప తప్పౌనటే!మాలో త్వచ్ఛుభరూపమున్ నిలుపు శ్రీమద్రాజరాజేశ్వరీ!
4.
జలముల్ మారిన మారవచ్చు నదిలో సంవత్సరాల్ దాటినన్
కలకాలంబుగ పేరు మారదు కదా గంగాప్రవాహంబుకున్
కలుషంబుల్ తొలగించు దైవమ!మహాకారుణ్యమూర్తీ! సదా
మలిజన్మంబుల రూపుమాపు మిఁక శ్రీమద్రాజరాజేశ్వరీ!
5.
సదసద్రూప విరాజభూష విలసత్ సంతోషమున్ గూర్చు త్వ
త్పదపద్మంబుల గొల్చి బ్రహ్మ హరియున్, ప్రాజంగమున్ వెల్గ, నా
పద వాటిల్లునె? పామరుండ గనుమా! పాలింపు మెవ్వేళలన్
మదిఁ గొల్తున్, విడనాడ నీ జపము శ్రీమద్రాజరాజేశ్వరీ!
6.
అఖిలాండేశ్వరి! పాప సంఘములవే యాసాంతమున్ బాయవే!
సుఖముల్ గూర్చెడి పాదయుగ్మమిలలో శోభిల్లు నెల్లప్పుడున్
ముఖమున్ జూచిన జాలు త్వత్కరుణచే మోహంబులే తొల్గుచున్
మఖముల్ జేసిన పుణ్యమబ్బుగద, శ్రీమద్రాజ రాజేశ్వరీ!
7.
వేదంబుల్ వివరించి దెల్పెను కదా ప్రేమమ్బునన్ బ్రోవ, నే భేదంబింతయు లేనె లేదనుచు, సంవేద్యంబు శ్రీపాదముల్ ఖేదంబున్ బరి మార్చు మార్గమగుటన్ గీడొందునే జన్మముల్?
శ్రీదా శ్రీనరసింహమూర్తికలితా శ్రీరాజరాజేశ్వరీ!
8.
రూపంబుల్ బహుళంబుగా నగుబడన్ లోకేశ వౌదీవెగా పాపౌఘమ్ముల రూపుమాపుచు సదా పాలింపు భద్రాత్మికా!దీపం బెవ్విధి వెల్గులీను నటులన్ దివ్యత్వమున్ జూపు, నిక్షేపం బయ్యది నీదు నామమెగదా శ్రీరాజరాజేశ్వరీ!
9.
ధర్మాధర్మ విచక్షణన్నెరిగి సద్ధర్మంబు పాటించుచన్ కర్మాచర్యల చేయు మీ జనుమ సత్కర్మం బదే సాధ్యమౌ నూర్మిన్ బోలిన జన్మమీ బ్రతుకు మాకుద్వేగమున్ బాపెడిన్ మర్మంబద్ది యెరుంగబర్చుమిఁక శ్రీమద్రాజరాజేశ్వరీ!
10.
మరుజన్మం బది యుందొ లేదొ తెలియన్ మా వల్ల దుస్సాధ్యమే
ఒరు లేమన్నను దల్తు మింక మదిలో నొండొక్కమారైననిన్ పరితాపంబుల జేరనీకు జననీ ప్రార్థింతు మెవ్వేళలన్
మరి క్రీగంటను జూడు నీ సుతుల శ్రీమద్రాజరాజేశ్వరీ!
11.
హరివాగీశసురార్చితా! హరసఖీ! యానంద సంధాయినీ!ధరణిన్ దేవతలెందరున్న మరి నీ దాసాన దాసుల్గదా! సరి నీకెవ్వరు లేనెలేరనుచు నిన్ సంపూర్ణ భక్తిన్ సదా మరువంజాలక నిన్ను గొల్తు మది శ్రీమద్రాజ రాజేశ్వరీ!
12.
కను విందుల్ గొలిపించు దివ్యగరిమా కారుణ్యవారాబ్ధివే
కనులారా నిను గాన నెంచనెదలో గాకున్నదెవ్వేళలన్
కనులన్ మూయకు నీవుమాత్రము మహాకల్పాంతమై దోచదే
మనమున్ నిల్వుము మమ్ముగావు మిక శ్రీమద్రాజరాజేశ్వరీ.
13.
శ్రీ బాలా త్రిపురేశ్వరీ త్రినయనీ చిన్నారి రూపంబునన్
ప్రాబల్యంబును పెంచుదీ వనుచు నిన్ ప్రార్థింతు నెవ్వేళలన్
నే బోధిల్లి తవాంఘ్రి పద్మ యుగమున్నిర్భీతితో మ్రొక్క, శు
ష్కీభూతాత్ముల నెల్ల బ్రోవు ధరణిన్ శ్రీ రాజరాజేశ్వరీ!
14.
కమనీయోక్తుల కావ్య మల్ల జననీ! కానైతి నే వ్యాసుడన్,
రమణీయంబుగ పద్యమల్ల మదిలో రాకున్న వేయూహలున్
శ్రమలో నీవె వసింతువం చెలమి విశ్వాసమ్ముతో నమ్మి, నీ
మమునన్ వీడను పాదపద్మముల శ్రీమద్రాజరాజేశ్వరీ!
15.
వరగంగాతటి నన్నపూర్ణ వగుచున్ వారింతువే క్షామమున్,
శరదిందీవర వర్ణరూపివయి భాషాయోషవై నిల్వవే,
వరలక్ష్మీ యని నిన్ను నమ్మి కొలవన్ బండింపవే కోర్కెలన్,
మరువంజాలను నిన్నుగొల్తు మది శ్రీమద్రాజరాజేశ్వరీ!
16.
గంగన్ దెచ్చుచు పూజ సేయుతరి లింగంబౌదు వారీతి, శ్రీ
రంగంబందున వేల్పువౌదువిఁక శ్రీరంగాఖ్య నామంబునన్,
శృంగారాకృతి నిన్నుమించు ఘనులీ క్షేత్రమ్మునందుందురే?
చెంగున్ వీడను బ్రోవుమింక జననీ శ్రీరాజరాజేశ్వరీ!
17.
యమదూతల్ తరుమంగ నాడు మదిలో నమ్మా! నినున్దల్వ, దే
హమునన్ జేరెడి వ్యాధులెన్నొ ముదిలో? నాయాస మెట్లుండునో?
భ్రమతో నే నొనరించినట్టి ఘనమౌ పాపౌఘముల్ బాపఁగా
మమకారంబున బ్రోవవేడెదను శ్రీమద్రాజరాజేశ్వరీ!
18.
చిరుగాలిన్ దలపించు నట్టివిధమున్ శ్రీలొల్కు నాలోక, మా
విరిమంచున్ దలపోయునట్టి కరుణా వీక్ష్యంబునెవ్వేళనున్,
శరమున్ బోలెడి వాడిచూపుల మహాసామ్రాజ్యసంధాత! నన్
స్థిరచిత్తంబున జాలితోడ గనుమా! శ్రీరాజరాజేశ్వరీ!
19.
అమ్మా! నీ పదధూళియే ప్రజకవిద్యా మోహమున్బాపదే,
అమ్మా! నీపద రేణువుల్ వెలుగవే యాకాశమం దర్కులై,
అమ్మా! నీ పదయుగ్మమున్ శరణమం చార్యా! సదా నమ్మితిన్,
మ మ్మేవేళలఁ గావవే జనని శ్రీమద్రాజ రాజేశ్వరీ!
20.
దహరాకాశము నందు వెల్గుచు, నితాంతాపార శక్త్యాత్మవై
బహిరాకాశము నందు సూర్యుడనగా బ్రహ్మాండ భాండోదరీ!
మహిమోపేతవు నీదు నామజపమమే మాకున్ సదా గమ్యమౌ,
స్పృహణీయమ్ము భవత్కృపామృతమహో! శ్రీరాజ రాజేశ్వరీ!
21.
దేవీ! నీదుమహత్త్వ మెన్న దరమా! దేవాసురాసాధ్యమే!
భావాతీతము నీదురూపమహహా భాసింతువీవెల్లడన్
నీవే దిక్కని నమ్మినిన్నుగొలుతున్ నీ దాసదాసుండనై
శ్రీ విద్యా! తగు దీవెనల్ కురియుమా శ్రీరాజరాజేశ్వరీ!
22.
కరుణాపాంగ! హృదంతరంగ విలసత్ గంభీర రత్నాసనీ!
తరుణుల్, తత్పతిదేవు లంత మదిలో తాదాత్మభావంబునన్,
వరలక్ష్మీ యను పేరనిన్ను గొలువన్ వర్షింపవే సంపదల్?
మరువంజాలము నీ కటాక్షమును శ్రీ మద్రాజరాజేశ్వరీ!
23.
ఓ యమ్మా నిను నిత్యమున్ గొలువఁ పాపౌఘమ్ము భస్మంబగున్
నీ యాజ్ఞా పరిపాలనన్ జగములన్ నిత్యంబు రక్షింతువే,
పాయంజాలను నీదు పాదములనే ప్రాజ్ఞా విశాలాక్షి! వి
చ్చేయం వేడెద హృన్నివాసమున నిన్ శ్రీరాజరాజేశ్వరీ!
24.
అధమస్థానుడ పారలౌకికవిధానాంధుండ నల్పుండనౌ
విదితం బయ్యెను నీ స్వరూపముఁదగన్ వీక్షింప నేడిట్టులన్
మది నిన్గొల్వగ నెంచితిన్ జననిరో! మస్తిష్క మేపారగన్
మదమాత్సర్యగుణాళిఁ బో నణచు శ్రీమద్రాజరాజేశ్వరీ!
25.
సృష్టిన్ జీవన శక్తి వీవనుచు వీక్షింపంగ సర్వాత్మవై
స్పష్టంబౌచు విచిత్రచిత్రపటమై భాసిల్లె దివ్యాకృతుల్,
దృష్టుల్ నీపయి సోకఁ గాంచదగునే దివ్యప్రభారాజితా!
శిష్టున్ జేయు! సుహృద్విశేష ఫలదా శ్రీ రాజరాజేశ్వరీ!
26.
నిను పూజింపక శక్తి యుక్తుడగనే నృత్యప్రియుండీశుడున్?
నిను పూజింపకనుండు మానవులతో నీకేమి లోటౌను?... నే
నను భావంబును పారదోలు మదిలో నార్యా! విశాలాక్షి! ని ల్చిన నీ భక్తుడగాన గొల్వ, జననీ! శ్రీ రాజరాజేశ్వరీ!
27.
వరమై మా యిలవేల్పువై వెలసితే పాల్మూరిలో దేవతై
పరదైవంబని నిన్ను గొల్వ మదిలో ప్రాప్తించు గైవల్యముల్
అరిషడ్వర్గము దూరముంచు గృపతో నానంద సంధాయినీ!
స్థిరచిత్తంబు నొసంగి వేదజననీ శ్రీరాజరాజేశ్వరీ!
28.
గతజన్మంబుల తీర్థయాత్రలను విజ్ఞానంబు నాసించుచున్
సతతంబేను చరించినాడనొ గదా సౌందర్యవారాన్నిధీ,
కృతకృత్యుండనుగా దలంచి జననీ కేల్మోడ్తు, సంతుష్టవై
మతిలో గొల్వయి యుండుమెల్లపుడు శ్రీమద్రాజరాజేశ్వరీ!
29.
తపమున్జేయగ శక్తి లేదు నియతిన్ దాదాత్మ్య తెట్లబ్బునో జపముల్జేయగ నైన నోపదు మదిన్ సంస్కారమీపాటి, య య్యపవర్గంబులభించుటెట్టుల? విధివ్యాపార సంప్రాప్తమౌ లిపి మార్వంగను నిన్నువేడెదను నే శ్రీరాజరాజేశ్వరీ!
30.
ప్రాయంబన్నది శాశ్వతంబనుచు నే పాపంబులన్ జేసితిన్
కాయంబీ గతి నాశమైన కడకున్ కాపాడ నిన్వేడుచున్
వ్రాయం బూనితి నీ మహాత్మ్యమిటు లవ్యాజంబునౌ దీక్షతోన్
మాయన్ ద్రోయక నన్ను బ్రోవఁ దగుఁ, శ్రీమద్రాజరాజేశ్వరీ!
31.
మోక్షంబన్నది చేరగాగలుగునే భోగార్థదేహంబిలన్?
మోక్షంబన్నది, భోగభాగ్యములు సంపూర్ణంబు నీ భిక్షయే,
సాక్షాద్దేవి కృపాకటాక్షములతో సాధ్యంబు గాదేరికిన్?
శిక్షల్ వేయక రక్ష సేయము సదా శ్రీరాజరాజేశ్వరీ!
32.
08.8.2025 నాటి పద్యం
బందూకుల్...
33.
కలికాలంబిది కానరాదు నిజమే, కారుణ్య చింతామణీ!తెలిసీ తెల్యక జేసినట్టి యఘముల్ దిద్దంగ నిన్వేడ శి ష్టుల రక్షింపుదు వీవె గాన, మదిలో స్తోత్రంబులన్ జేసెదన్, మలిజన్మంబులు లేనిముక్తి నిడు శ్రీమద్రాజరాజేశ్వరీ!
34.
ఉదయాత్పూర్వమె పూజ జేసి విధిగా నూహింపనౌ రీతిగా
సదసద్రూపి మహోన్నతాంబ ప్రతిమన్ సౌందర్య మేపారగా
విధిగా 'వాట్సపు' నందు నుంచ గనుచున్ వేదాత్మ యౌభారతిన్,
మదిసంతోషము నిండె నివ్విధిని శ్రీమద్రాజరాజేశ్వరీ!
35.
సౌమ్యా! సౌమ్యతరా! అశేష కరుణా సౌభాగ్య సంధాయినీ!
రమ్యంబౌ భవదీయగాధలు వినన్ బ్రాప్తించు కైవల్యమే,
గమ్యంబీవని యెంచి పూజలిడుదున్ గౌరీ! మృడానీ! సదా
క్షేమ్యం బెంచెడు దాన వౌత బహుధా శ్రీరాజరాజేశ్వరీ!
36.
*అమ్మా! నీ పదధూళియే ప్రజకవిద్యా మోహమున్బాపదే,*
*అమ్మా! నీపద రేణువుల్ వెలుగవే యాకాశమం దర్కులై,*
*అమ్మా! నీ పదయుగ్మమున్ శరణమం చార్యా! సదా నమ్మితిన్,*
*మ మ్మేవేళలఁ గావవే జనని శ్రీమద్రాజ రాజేశ్వరీ!*
37.
దహరాకాశము నందు వెల్గుచు, నితాంతాపార శక్త్యాత్మవై
బహిరాకాశము నందు సూర్యుడనగా బ్రహ్మాండ భాండోదరీ!
మహిమోపేతవు నీదు నామజపమమే మాకున్ సదా గమ్యమౌ,
స్పృహణీయమ్ము భవత్కృపామృతమహో! శ్రీరాజ రాజేశ్వరీ!
38.
దేవీ! నీదుమహత్త్వ మెన్న దరమా! దేవాసురాసాధ్యమే!
భావాతీతము నీదురూపమహహా భాసింతువీవెల్లడన్
నీవే దిక్కని నమ్మినిన్నుగొలుతున్ నీ దాసదాసుండనై
శ్రీ విద్యా! తగు దీవెనల్ కురియుమా శ్రీరాజరాజేశ్వరీ!
39.
కరుణాపాంగ! హృదంతరంగ విలసత్ గంభీర రత్నాసనీ!
తరుణుల్, తత్పతిదేవు లంత మదిలో తాదాత్మభావంబునన్,
వరలక్ష్మీ యను పేరనిన్ను గొలువన్ వర్షింపవే సంపదల్?
మరువంజాలము నీ కటాక్షమును శ్రీ మద్రాజరాజేశ్వరీ!
40.
ఓ యమ్మా నిను నిత్యమున్ గొలువఁ పాపౌఘమ్ము భస్మంబగున్
నీ యాజ్ఞా పరిపాలనన్ జగములన్ నిత్యంబు రక్షింతువే,
పాయంజాలను నీదు పాదములనే ప్రాజ్ఞా విశాలాక్షి! వి
చ్చేయం వేడెద హృన్నివాసమున నిన్ శ్రీరాజరాజేశ్వరీ!
41.
*తొలిబామందున జేసినట్టి వ్రతమో! తోడ్పాటు నీదౌటచే*
*కలికాలంబున బూజసేయదగు భాగ్యంబబ్బె నేడిట్టులన్,*
*కలకాలంబును గావవమ్మ జననీ గంగాపురాన్వాయులన్*
*చెలిమిన్ జూపుచు వారి పట్ల జననీ శ్రీ రాజరాజేశ్వరీ!*
42.
*బాలా! నీ పదపద్మయుగ్మమును నే భావించి యర్చింపగా*
*బాలుండౌటను మేలమాడ జననీ! భావ్యంబు నీ కౌనటే?*
*చాలీచాలని బుద్ధితోడ రచనల్, శార్దూల, మత్తేభముల్*
*మాలల్ కూర్చ దలంచితిన్ మదిని శ్రీమద్రాజరాజేశ్వరీ!*
43.
బ్రహ్మోపేంద్ర మహేంద్ర దేవగణముల్ భావించి నీరూపమున్,
బ్రాహ్మీ! హైమవతీ! త్రినయనీ! ప్రాముఖ్యులై వెల్గుచున్
బ్రహ్మాండమ్ముగ పాలనల్ సలిపిరే, బ్రహ్మాండ భాండోదరీ!
జిహ్మంబౌ మదహంకృతిన్ జెఱచుమా, శ్రీ రాజరాజేశ్వరీ!
44.
*దేవీ! నీ ఘన రూపమీ పుడమిలో దేదీప్యమానంబుగా*
*నావిర్భావము నొంద భక్తు లిలలో నత్యంత శ్రద్ధాళులై,*
*బ్రోవన్వేడ మదంబ, కావు సతమున్ బుణ్యాత్ములన్, బ్రేమతో*
*సేవల్ సేసిన వారినెల్ల జననీ శ్రీ రాజరాజేశ్వరీ!*
45.
బాలార్కున్ సరిబోలు వర్ణయుతవై భాసించు నిన్ వేడెదన్
బాలా! నీ దయ యున్న జాలు నిఁక సౌభాగ్యంబు జేకూరదే
పాలమ్మూరిని కొల్వుదీరితివి ,సదా పాలించు నీ బిడ్డలవ్
శ్రీలన్, బుద్ధి, యశమ్ము నిమ్ము జననీ! శ్రీ రాజ రాజేశ్వరీ!
46.
*ఓంకారమ్మున కాదిమూలమవు, సర్వోత్కృష్ట సంభావినీ!*
*సంకోచింతును నిన్ను గొల్వ జననీ! సాదృశ్యమే కాననే,*
*వంకల్ బెట్టక, నన్ను గావు లలితా! వాత్సల్యమున్ జూపు..., మ*
*ర్మం కర్మంబులెరుంగనే మదిని, శ్రీమద్రాజరాజేశ్వరీ!*
47.
*జగమే బ్రహ్మము, వేరుగాదనుచు సుజ్ఞానుల్ విచారింపరే!*
*యగజా నీమహనీయ విగ్రహ మనేకానేక రూపాలుగా*
*నగుపింపన్ సహజమ్ము గాన, నటులాయారీతులన్ బోల్చి, నీ*
*మగనిన్, నిన్ను సదా స్మరింతు మది, శ్రీమద్రాజరాజేశ్వరీ!*
48.
జగతీ, బ్రహ్మము వేరుగాదనుచు సుజ్ఞానుల్ విచారింపరే!
పగలున్ రేయిని సూర్య చంద్రు లిలలో బాహుళ్యమై నీటినం
దగుపింపన్ సహజమ్ము గాదె! యటులే ధ్యానింతు నార్యాణి! నీ
మగనిన్, నిన్ను సదా స్మరింతు మది, శ్రీమద్రాజరాజేశ్వరీ!
49
కారుణ్యాబుధి! కంచిలోన గొలువౌ కామాక్షి వీవే కదా!
చేరందీయవె భక్తులన్ సతము సంసేవింప నీరీతి, సా
కారమ్మై యిట పాలమూరి ప్రజనే కావంగ నేతెంచితే!
మారామేలనె? మమ్ము బ్రోవు మిఁక శ్రీమద్రాజ రాజేశ్వరీ!
50.
ఆలంపూరిని జోగులాంబ వయినన్ హైమావతీ నీవ! శ్రీ
శైలమ్మందున మల్లికార్జునుని సంస్థానంబు నీదే కదా!
పాలమ్మూరిని సేవలందుకొన సంప్రాప్తించి తీవంచు నే
చేలంబుల్ నిడ నాదుకొమ్ము జననీ శ్రీ రాజరాజేశ్వరీ!
51
వర గోదావరి తీరమందు కొలువై వ్యాసర్షి సంసేవ్య వై,
చిరకాలంబుగ పూజలందు కొనెదో! శ్రీవాణి రూపంబుతో,
తరియింపన్ బహు మానవాళి నిట సంధానమ్ము నీవంచు, నే
స్మరియింతున్ నిను పాలమూరి వర శ్రీమద్రాజరాజేశ్వరీ!
52.
నిజభర్తన్ గను దివ్యశక్తి యుతమౌ నీ దివ్య రూపంబునున్
నిజమౌభక్తిని శుక్రవాసరమునన్ నిన్నిట్లు గొల్వంగ, మా
నిజ సంతానముఁ మర్వబోరు సతమున్ నీరేజ పత్రేక్షణీ!
ఋజువీ పూజల నందుకొమ్ము జననీ శ్రీ రాజరాజేశ్వరీ!
53.
🙏🏻 శ్రీ మహా కాళీ, మహా లక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణిగా తలుస్తూ.....🙏🏻
శా.
*విద్యాభ్యాసము సేయ నీవ గదవే, విశ్వేశ్వరీ! వాఙ్మయీ!*
*సద్యో లక్ష్మిని గూర్ప నీవ కనగన్, సౌభాగ్య చింతామణీ!*
*ఆద్యా! భక్తుల గావ దున్మెదవు దుర్వ్యాపార పారీణులన్,*
హృద్యంబౌ భవదీయ దివ్య కథలే, శ్రీ రాజరాజేశ్వరీ!
54.
సౌవర్ణాంబర ధారిణీ! ఉరులసత్సౌందర్య చింతామణీ!
నీవే దిక్కని నమ్మిగొల్చితి గదా నీమంబుతో నిత్యమున్,
గైవల్యంబునె కోరుకొంటి మదిలో గారుణ్య రత్నాకరీ!
శ్రీవిద్యా! పరదేవతా త్రిపుర నీ శ్రీరాజ రాజేశ్వరీ!
55.
*ముక్తా విద్రుమ హేమ నీల ధవళంబుల్ పంచవక్త్రంబులై,*
*యుక్తంబౌ ఘన వేదభావనల నత్యుక్తంబులన్ వెల్గె దో*
*శక్తీ! తోయజవైరిధారి! జననీ! సద్భక్తి పూర్ణుండ, నే*
*రిక్తుండౌదునె నిన్నుగొల్వ గరిమన్! శ్రీ రాజరాజేశ్వరీ!*
56.
*జాబిల్లిన్ సిగ దాల్చినట్టి జననీ చల్లంగ నన్నారయం*
*గేబామందున నేమి నోచితినొ నేడీరీతినిన్ గొల్వగన్,*
*ప్రాభాతంబున సేవజేసెదను నీప్రాముఖ్యతన్ మర్వకన్,*
*శ్రీ బాలాత్రిపురేశ్వరీ! త్రినయనీ! శ్రీ రాజరాజేశ్వరీ!*
57.
*నిగమంబుల్ విశదీకరించు నగజా! నీ నామ మాహాత్మ్యమున్,*
*పగలున్ సంధ్యలఁ భక్తి యుక్తముగ సంభావించి పూజింతునిన్*
*జగదంబా! నెఱ నమ్మి కొల్తు గనవే శాకంబరీ! శాంభవీ!*
*జిగిఁ దళ్కొత్త జగమ్ముఁ గావు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ!*
58.
శా.
*శ్రీ విఘ్నేశ్వరమాతృమూర్తి! గిరిజా! సేమంబునన్ జూడవే,*
*మా విశ్వాసము వమ్ము జేయ దగునా మాహేశ్వరీ! పార్వతీ!*
*ఏ వేల్పైనను నిన్ను గొల్చును గదా! యేనింక నిన్ నమ్మితిన్*
*సేవల్ జేతును, పాదముల్ విడువనే శ్రీ రాజరాజేశ్వరీ!*
59.
*ఫాలమ్మందున బాలభాను రుచితో, 'ప్రజ్ఞన్' ప్రసాదించు మా!*
*'పాలమ్మూరి'న సుప్రతిష్టిత! సుధాపారమ్ములైనట్టి దృ*
*ఙ్మాలా చందన భూషణమ్ములిడు నమ్మా! యంచు నీతృప్తికై,*
*చేలమ్ముల్ ప్రతి వారమిచ్చు గనవే, శ్రీ రాజరాజేశ్వరీ!*
60.
వనమందైనను మేడపైననుసరే ప్రాలేయభానుండు చా
ర్విని బండించు విధంబు, నీదు కరుణా దృష్టిన్ సమీక్షించి, జీ
వనమున్ జక్కగ సాగనిమ్ము నిఁక శర్వాణీ! శివా! మత్తకా
శిని! మా ప్రార్థన లాలకించు జననీ! శ్రీ రాజరాజేశ్వరీ!
చార్వి- వెన్నెల
మత్తకాశిని- ఉత్తమ స్త్రీ
61.
ఆదిత్యుండు వెలుంగు లిచ్చు తెఱగై యవ్యాజ తేజంబునన్
దేదీప్యద్భవదంఘ్రి ధూళి, మదులన్ దీనత్వమున్ దీర్చుచున్,
మోదంబున్ భువి నింపు పుష్పచయమై మోహమ్ములన్ బాపుచున్,
ఛేదించున్ భవబంధ పీడనములన్ శ్రీ రాజరాజేశ్వరీ!
తా:
భాస్కరుడు చీకట్లను పారద్రోలి వెలుగుల పంచినట్లు, శ్రీ రాజరాజేశ్వరీ దేవీ! నీ యొక్క పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞనప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను చైతన్యమనే పూలగుత్తులను పూయించి మోహమును బాపి, భవబంధముల బాధలను బాపునట్టిది.
62.
ఫాలంబందున చంద్రరేఖ ఛవితో భాసిల్లు సౌందర్యమున్,
బాలార్కున్ సరిబోలునట్టి విధమున్ భావింపగా నెట్లు? వే
దాలున్, శాస్త్రములైన మేలువిధిగా దర్శించు నేపాటిగా?
లీలా రూప శివుండు మాత్ర మెఱుగున్ ! శ్రీ రాజరాజేశ్వరీ!
63.
నలువే వర్ణన చేయలేననెను దానానాల్గు వక్త్రంబులన్
నెలతాల్పైన నెఱుంగ లేడు తుదఁ దా నేనానముల్ గల్గి, దా
రల షడ్వక్త్రుఁ, డహీశుడైన సతమున్ హల్లోహలింపంగ; పూ
జిల నీయల్పుని జూడవమ్మ దయతో శ్రీరాజరాజేశ్వరీ!
64.
*శ్రీమన్మంగళ దాయినీ భగవతీ చిద్రూపి కాత్యాయనీ!*
*శ్రీమంతంబది నీదు లక్షణము గా శ్రీచక్రసంచారిణీ!*
*కౌమారీ!దయఁ జూడవమ్మ జననీ! గంగాపురం వంశమున్,*
*క్షేమంబున్ భువి నింపు మాత! మహితా!శ్రీరాజరాజేశ్వరీ!*
కౌమారీ- పార్వతి(బ్రహ్మచర్య వ్రతమున నుండు వానిని పెండ్లియాడిన స్త్రీ).
65.
*వేదార్థంబుల నేనెరుంగజననీ! విజ్ఞానశూన్యుండనై*
*నీదౌ పూజల జేయఁ నేనెరుఁగనే నిత్యంబు నీ జన్మలో*
*శోధింపన్ మతిలేని వాడనగుటన్, జూపించుసన్మార్గమున్*
*శ్రీ దా! నీ పదపద్మదాసుఁడ గదా! శ్రీరాజరాజేశ్వరీ!*
66.
Verified upto nov 21
శ్రీ దేవ్యై నమః🙏🏻🙇♂️🙏🏻
మత్త.
*కన్నులారఁగ శుక్రవారము గాంచుచున్ మను వార మ*
*య్యున్నవీన కుతూహలోత్సవ యుక్తి శాంకరి నిట్లు రా*
*మన్నయే మన కివ్విధంబున యాదరంబున బంపగా,*
*మిన్నగా మనమంతయున్ గడమీరకుండగ మ్రొక్కమే!*
ఆరంగ-నిండుగా,
మనువారము-జీవించువారము,
యుక్తి -కూడిన
గడమీరకుండ- నియమం ప్రకారం
మ్రొక్కమే-మ్రొక్కుతాము.
Comments
Post a Comment