"భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో"
జనపదు లంత నాగమను జాణ యటంచును నింద సేతురే,
నిజమును సెప్పబూనరు వినిర్మల బుద్దిని; న్యాయశీలి, భే
షజమును వీడి కావగ సైన్యము నంతయు రాయబారమే
ప్రజలకు మేలు గూర్చు నని, ప్రాణము సైతము లెక్క జేయదే!
భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో.
Comments
Post a Comment