పాఠశాల

 సెలవుల అనంతరం ప్రారంభమైన పాఠశాలలలో

పిల్లల సందడిని వర్ణిస్తూ

ఉత్పలమాల పద్యం చెప్పండి

1వ పాదం 4వ అక్షరం 'పా'

2వ పాదం 11వ అక్షరం 'ఠ'

3వ పాదం 16వ అక్షరం 'శా'

4వ పాదం 19వ అక్షరం 'ల'


ప్రయత్నం:


ఆటల పాటలన్ మునిగి హాయిగ నాడెడి బాలబాలికల్

వాటిక లెల్లవీడి యిక పాఠము లందున దృష్టి నిల్పుచున్

మూటల నిండ పొత్తముల బుద్ధిగ నేర్వగ, శాస్త్రవేత్తలే

సాటిగ రారు మాకనుచు సాగిరి ముద్దుగ పాఠశాలకున్.

Comments

Popular posts from this blog

ఉత్సాహ